పాము కాటేస్తే.. మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు.. అంతే ఆ ముగ్గురు?
ఆధునికత పెరిగిపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు గట్టిగా పట్టుకుని ఊగిసలాడుతున్నారు. తాజాగా ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మూఢనమ్మకంతో ముగ్గురు ప్రాణాలు బలైనాయి. వివరాల్లోకి వెళితే.
ఆధునికత పెరిగిపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు గట్టిగా పట్టుకుని ఊగిసలాడుతున్నారు. తాజాగా ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మూఢనమ్మకంతో ముగ్గురు ప్రాణాలు బలైనాయి. వివరాల్లోకి వెళితే.. మూఢ నమ్మకం కారణంగా బీహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
బీహార్, భోజ్‌పూరి జిల్లా ఆగమా గ్రామానికి చెందిన రాజేశ్ (45), ఆయన కుమార్తె అంశు కుమారి, కుమారుడు విష్ణులు ఒకే మంచంపై నిద్రిస్తుండగా.. పాము కాటు వేసింది. దీంతో విషమెక్కి ముగ్గురు సాయం కోసం గట్టిగా అర్థించారు.
వీరి అరుపులతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు వీరిని ఆస్పత్రికి తరలించడం మాని స్థానికంగా ఉండే మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అతను మంత్రం ద్వారా విషం తొలగిస్తున్నట్లు డ్రామా చేశాడు. చివరికి పాము విషం శరీరమంతా వ్యాపించడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.