Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (07:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ఎల్ఆర్ ముందుకు వచ్చింది.

ఈమేరకు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి సీజీఎం టెక్నికల్ డాక్టర్ గుజ్జుల రవి, ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్ తవ్వ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 

ఈ ఒప్పందం ప్రకారం ఎక్స్ఎల్ఆర్ సంస్థ డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులతోపాటు అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

రాబోయే రోజుల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న మరిన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటిరెడ్డి అన్నారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఎపిఎస్‌ఎస్‌డిసితో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్ తవ్వ అన్నారు. 

ఇప్పటికే ఎపిఎస్‌ఎస్‌డిసి - ఎక్స్ఎల్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లోని 2500 మంది అధ్యాపకులకు డేటా సైన్స్ పై నెలరోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది.

అంతేకాకుండా ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ (ఇసిఇ, సిఎస్ఇ / ఐటి) &ఎంటెక్ (ఇసిఇ, సిఎస్ఇ /ఐటి) చివరి సంవత్సరం చదువుతున్న 3,272 మంది విద్యార్థులకు 40రోజల పాటు డేటా అనలిటిక్స్ పై ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments