Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం.. చాక్లెట్ ఇస్తానని ఆశచూపి..?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (15:36 IST)
ఆరేళ్ల బాలికపై కర్నూలులో ఘోరం జరిగింది. 15 ఏళ్ల బాలుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు గ్రామానికి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు వ్యవసాయ, ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతిరోజులానే ఈ నెల 2న గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కూలీ పని చేసేందుకు వెళ్లారు. ఈ దంపతుల ఆరేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. పొరుగింటి 15 ఏళ్ల బాలుడు.. బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి బాత్‌రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన బాలిక.. వారం రోజుల క్రితం జరిగిన ఘటనను గురువారం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు సంజామల పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాలుడిపై ఫోక్సో చట్టం, సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments