Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకెళ్లిన ఆరుగురు బాలురు మృతి

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (06:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకెళ్లిన ఆరుగురు బాలురు దుర్మరణం చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది.

వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా వసంతవాడ వాగులో ఈత కోసం దిగారు. ఇంతలోనే ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
 
ఆ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతులంతా 15- 16 సంవత్సరాల మధ్య వయసున్న వారుగా తేలింది. 
మృతుల వివరాలు: 1) గంగాధర వెంకట్రావు (16), 2) శ్రీరాముల శివాజీ (16), 3) గొట్టుపర్తి మనోజ్ (16), 4) కర్నటి రంజిత్ (15), 5) కెల్లాసాయి (16), 6) కూనవరపు రాధాకృష్ణ (15).

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments