Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టిన చెల్లెలు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (16:08 IST)
రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పౌర్ణమి రోజు ఎక్కడ ఉన్నాసరే.. అన్న లేదా తమ్ముడు క్షేమంగా ఉండాలని తోబుట్టువులు రాఖీ కట్టడానికి పుట్టింటికి వస్తారు. కానీ తాజాగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలికి అనుకోని ఘటన ఎదురైంది. గుండె పోటుతో ఒక్కసారిగా అన్న తుదిశ్వాస విడిచాడు. అన్నయ్య మరణంతో ఆ సోదరి చివరిసారిగా మృతదేహానికి రాఖీ కట్టి అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తు చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం, ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటివరకు సంతోషంగానే వున్నాడు. కానీ వున్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
దీంతో చెల్లెలు గౌరమ్మ షాక్‌ అయ్యింది. అన్నయ్య ఇక లేదన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ సోదరి దుఃఖాన్ని చూసి అక్కడ వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అన్న క్షేమంగా వుండాలని రాఖీ కట్టడానికి వస్తే.. తనకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించింది.. ఆ చెల్లెలు. ఆపై కడసారిగా అన్నయ్య మృతదేహానికి రాఖీ కట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments