Webdunia - Bharat's app for daily news and videos

Install App

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (10:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ)గా పని చేసే ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించేచ ఆయన.. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. 
 
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
భర్తను వదిలేసి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం.. ఆపై ఆర్టీసీ డ్రైవరుపై మోజు.. 
 
భర్తను వదిలేసిన ఓ మహిళ పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం తర్వాత ఆర్టీసీ డ్రైవరుపై మోజుపడింది. ఈ విషయం ప్రియుడుకి తెలిసి, ఆమెను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ... ప్రియుడు తలపై ముద్దకవ్వంతో బలంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకుగురైన ఆమె ఇంటినుంచి పారిపోయింది. ఈ దారుణం కాకినాడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాకినాడ జిల్లా రావులపాలెంకు చెందిన మునిస్వామి లావణ్య అనే మహిళకు చిత్తూరు జిల్లాకు చెందిన బాలుతో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో రావులపాలెంకు చెందిన గుడాల చంద్రశేఖర్ స్వామి (30) అనే వ్యక్తితో లావణ్యకు నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి వారిద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. 
 
ఇదిలావుంటే, లావణ్యకు కాకినాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుతో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో మొదటి ప్రియుడు చంద్రశేఖర్‌ను వదిలివేసి లోవరాజు వద్దకు వచ్చేసింది. దీంతో రెండు నెలల క్రితం లోవరాజు తన ప్రియురాలిని కాకినాడ డైరీఫారం సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్ళలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంచాడు. ఇదిలావుంటే, చంద్రశేఖర్ తన ప్రియురాలు లావణ్య జాడ తెలుసుకుని బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు.
 
అర్థరాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా లావణ్య చంద్రశేఖర్‌ను ఇంట్లో ఉన్న ముద్దకవ్వం,  ఇనుప సున్నీరాయితో తలపై బలంగా కొట్టింది. దీంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితురాలు లావణ్య పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య కేసు విషయమై లోవరాజును పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments