Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం!

Advertiesment
Nara Lokesh

ఠాగూర్

, గురువారం, 30 జనవరి 2025 (14:36 IST)
ఇంటర్ మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షల రద్దుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా, ఇపుడు వెనక్కితగ్గింది. వచ్చే యేడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానంలాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టరని, అభ్యసన సామర్ధ్యాలు తగ్గిపోతాయనిలాంటి పలు సూచనలు వచ్చాయి. అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. గణితంలో ఏ, బీ పేపర్లు ఉండవు. రెండింటిని కలిపి ఒకే పేపర్గా ఇస్తారు. 
 
వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పేపర్ ఉంటుంది. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. మరో భాష సబ్జెక్టును విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటిపై త్వరలో ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టేబుల్ మీద రూ. 70 కోట్లు, పావుగంటలో ఎంత లెక్కిస్తే అంత మీదే: ఉద్యోగులకు బంపర్ ఆఫర్