Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పు చేస్తే తలదించుకుంటా... లేదంటే తాట తీస్తా.. నాకు ఏదీ లెక్కలేదు : ఎమ్మెల్యే గుమ్మనూరు

Advertiesment
gummanuru jayaram

ఠాగూర్

, గురువారం, 30 జనవరి 2025 (12:51 IST)
తన గురించి అసత్య కథనాలు రాస్తే పట్టాలపై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తారని, వాటిని నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతామని హెచ్చరించారు. గుంతకల్లు దాని ముక్కల రోడ్డులోని జగనన్న కాలనీని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా.. తన గురించి ఓ న్యూస్ చానల్లో వచ్చిన ఓ కథనంపై ఆయన తీవ్రస్వరంతో స్పందించారు. 
 
'నా అనుచరులు, బంధువులు ఎవరినో రైలు పట్టాలపై పడుకోబెట్టి ఆస్తులు రాయించుకున్నారని, స్థలాలను కబ్జా చేశారని, కర్ణాటక మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారని, ఇసుక దందా నడుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో న్యూస్ చానళ్లు, పత్రికలవారు నిరూపించాలి. తప్పు చేసినట్లు నిరూపిస్తే తల దించుకుంటాను. లేదంటే తాట తీస్తాను. నాకు ఏదీ లెక్కలేదు. అన్నీ చేసాచ్చినోడినే' అని హెచ్చరించారు. 
 
మరోవైపు, ఎమ్మెల్యే గుమ్మనూరుకు టీడీపీ అధిష్టానం మందలించింది. స్థానికంగా ఉండే పాత్రికేయులను ఎమ్మెల్యే దుర్భాషలాడారని, ఏబీఎన్ పాటు మరికొన్ని చానల్స్ వార్తా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో జయరాంకు ఫోన్ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పాత్రికేయులను దుర్భాషలాడటం టీడీపీ సంస్కృతి కాదని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేకు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Good Samaritan Scheme: రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్చితే.. రూ.25వేలు ఇస్తారు.. తెలుసా?