Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి పరాయి పురుషుడితో అక్రమ సంబంధం.. ఆపై ఆర్టీసీ డ్రైవరుపై మోజు.. చివరకు..

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (09:06 IST)
భర్తను వదిలేసిన ఓ మహిళ పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం తర్వాత ఆర్టీసీ డ్రైవరుపై మోజుపడింది. ఈ విషయం ప్రియుడుకి తెలిసి, ఆమెను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ... ప్రియుడు తలపై ముద్దకవ్వంతో బలంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకుగురైన ఆమె ఇంటినుంచి పారిపోయింది. ఈ దారుణం కాకినాడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కాకినాడ జిల్లా రావులపాలెంకు చెందిన మునిస్వామి లావణ్య అనే మహిళకు చిత్తూరు జిల్లాకు చెందిన బాలుతో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో రావులపాలెంకు చెందిన గుడాల చంద్రశేఖర్ స్వామి (30) అనే వ్యక్తితో లావణ్యకు నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి వారిద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. 
 
ఇదిలావుంటే, లావణ్యకు కాకినాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుతో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో మొదటి ప్రియుడు చంద్రశేఖర్‌ను వదిలివేసి లోవరాజు వద్దకు వచ్చేసింది. దీంతో రెండు నెలల క్రితం లోవరాజు తన ప్రియురాలిని కాకినాడ డైరీఫారం సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్ళలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంచాడు. ఇదిలావుంటే, చంద్రశేఖర్ తన ప్రియురాలు లావణ్య జాడ తెలుసుకుని బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు.
 
అర్థరాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా లావణ్య చంద్రశేఖర్‌ను ఇంట్లో ఉన్న ముద్దకవ్వం,  ఇనుప సున్నీరాయితో తలపై బలంగా కొట్టింది. దీంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితురాలు లావణ్య పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య కేసు విషయమై లోవరాజును పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments