అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎలా? ఎమ్మెల్యే అంటే అర్థం తెలుసా.. ?: వైఎస్ షర్మిల (Video)

సెల్వి
మంగళవారం, 12 నవంబరు 2024 (15:16 IST)
Sharmila
అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ సమావేశాలకు వైకాపా చీఫ్ జగన్ హాజరుకాకపోవడం చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుందని ఘాటుగా విమర్శించారు. 
 
జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికా? అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే అర్థం తెలుసా? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. 
 
అహంకారంతో జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు.. అసలు మీకు ఏమైందంటూ అంటూ వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 11 సీట్లే ఎందుకు ఇచ్చారు..?, ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చొని మాట్లాడడానికా..?, అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలను వెన్నుపోటు పొడవడం కాదా..? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కనబెట్టి అసెంబ్లీకి వెళ్లి, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి.. అంటూ షర్మిల జగన్‌పై మండిపడ్డారు. 
 
కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కు లేదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు కావడంలేదు. రాష్ట్రంలో మహిళలపై దాడులు ఆగడంలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే అవకాశాన్ని ప్రజలు వైసీపీకి ఇస్తే , ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనడం సిగ్గుచేటు అని షర్మిల అన్నారు. 
 
ఇక కేంద్రంలో... 2014లో 44 సీట్లు... 2019లో 52 సీట్లే వచ్చినా కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా అడగలేదు. హోదా లేకపోయినా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రజల పక్షాన పోరాడారు. మోదీ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ, దేశ ప్రజల గొంతుకలా కాంగ్రెస్ మారిందనే విషయాన్ని షర్మిల గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments