Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్ చెప్పండి.. కరోనా సమాచారం పొందండి: కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:09 IST)
సామాజిక మాధ్యమం  “చాట్ బోట్” (8297 104 104) లో హాయ్ అని టైప్ చేయడం ద్వారా కరోనా వైరస్ (కోవిడ్-19) గురించి ప్రాథమిక సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సేవలు తెలుసుకోవచ్చని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్-అఫీషియో కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 
 
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో సరైన సమాచారం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూజర్స్ ఫ్రెండ్లీ యాప్ ను తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా హెల్ప్ డెస్క్, పేస్ బుక్, వాట్సాప్ ల్లో కోవిడ్-19 గురించి పూర్తి సమాచారాన్ని పొందే అవకాశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ వాట్సాప్ నంబర్ 8297 104 104 ను కాంటాక్ట్ లిస్టులో పొందుపరచడం ద్వారా ఎవరైనా ఎక్కడ నుంచైనా ఎప్పుడైనా తాజా సమాచారం పొందవచ్చు అని తెలిపారు. ఫేస్ బుక్ లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా సమాచారం వదంతులకు తావు లేకుండా ఖచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికకు 8297 104 104 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ వాట్సప్ కాంటాక్ట్ లిస్ట్ లో 8297 104 104 నంబర్ ఫీడ్ చేసి ‘హాయ్’ అని టైప్ చేసి సెండ్ చేయగానే అందరికీ అందుబాటులోకి కరోనా (కొవిడ్-19) సమాచారం పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

ఇందులో 9 విషయాలకు సంబంధించి కరోనా వైరస్ గురించి కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితి,ఆరోగ్య కేంద్రాలు/ఐసోలేషన్ కేంద్రాలు, ప్రభుత్వ అధికారిక సమాచారం, లాక్‌డౌన్ సంబంధిత సమాచారం, ప్రభుత్వ సహాయం కొరకు, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు, తాజా పత్రికా ప్రకటనలు పొందడమే కాకుండా మీ అభిప్రాయం పంచుకోవొచ్చు అలాగే ప్రభుత్వం జారీ చేసిన కరోనాకు సంబంధించిన జీవోలను చాట్ బోట్ లో పొందవచ్చన్నారు.  

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments