Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితకాల పోరాటం చేసిన అంబేద్క‌ర్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:58 IST)
కుల మత రహిత, ఆధునిక భారత దేశం కోసం భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవిత కాలం పోరాటం చేసారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

దళితుల పట్ల నాటి సమాజంలో ఉన్న సామాజిక వివక్షను అరికట్టడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని పేదలు, అణగారిన, దిగువ తరగతి కులాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారన్నారు.

భారత రాజ్యాంగ పితామహునిగా దేశానికి ఆయన వెలకట్ట లేని సేవలు చేసారని గవర్నర్ ప్రస్తుతించారు. అంబేద్కర్ ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,  రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా అన్ని వర్గాలతో కొనియాడబడ్డారని పేర్కొన్నారు. 

గొప్ప స్వాతంత్య్ర సమరయోధునిగా దేశం కోసం ఎంతో శ్రమించారని, కుల రహిత సమాజం కోసం విశేష కృషి చేయటమే కాక, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలు చారిత్రాత్మకమైనవని గౌరవ గవర్నర్ వివరించారు.

అంబేద్కర్ జన్మదినం నేపధ్యంలో రాజ్ భవన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments