Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపేస్తానంటున్నారు కాపాడండి: వైఎస్ వివేకా కూతురు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (20:52 IST)
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా మారుతోంది. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తు వివేకా ఇంటిలోనే ఆయన హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
అసలు ఈ హత్య వెనుక అసలు కారణం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు సొంత చిన్నాన్న చనిపోతే ముఖ్యమంత్రి ఆ కేసును ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా వై.ఎస్. వివేకానందరెడ్డి కుమార్తె వై.ఎస్. సునీత కడప జిల్లా కలెక్టర్‌ను కలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
అంతేకాదు రాతపూర్వకంగా అసలు ఏం జరుగుతుందోనన్న విషయాన్ని స్పష్టంగా రాసిచ్చింది. నా తండ్రి హత్యపై అనేక రకాల అనుమానాలున్నాయి. ఈ కేసులో నన్ను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని అనుమానంగా ఉంది. నా ప్రాణాలను కాపాడండి.. నన్ను రక్షించండి అంటూ కడప జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు వై.ఎస్. సునీత.
 
ఇప్పటికే వ్యక్తిగత సిబ్బందిని బాడీగార్డ్‌ను వెంట పెట్టుకుని తిరుగుతున్నారు వై.ఎస్.సునీత. ఎస్పీని కలిసిన తరువాత ఎలాంటి భద్రత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. అయితే వివేకా హత్యకు సంబంధించి నిందితుడిని పట్టుకున్న తరువాత ఆయన కుమార్తె ఎస్పీని కలవడం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments