Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు పెంపు... మంత్రి నక్కా ఆనందబాబు

అమరావతి; రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. ఉద్యోగుల వేతనాలు పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల ప్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (19:42 IST)
అమరావతి; రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. ఉద్యోగుల వేతనాలు పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 9 కోట్ల 26 లక్షలు భారం పడుతుందన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి నక్కా ఆనందబాబు విలేకర్లతో మాట్లాడారు. జీతాల పెంపు వల్ల ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1112 మంది లబ్ది పొందనున్నారని అన్నారు. పెంచిన జీతాల వివరాలు ఇలా ఉన్నాయి. 
 
పీజీ క్వాలిఫికేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్స్‌కి ప్రస్తుతం రూ.16050 ఇస్తుండగా రూ.24,225కి పెంచుతున్నామని చెప్పారు. పీజీ క్వాలిఫికేషన్ లేని టీచర్స్ జీతాలు రూ. 14,860 నుంచి రూ.22,290కి, పీఈటీ, క్రాప్ట్, ఆర్ట్, మ్యూజిక్ టీచర్స్ జీతాలు రూ. 10,900 నుంచి రూ.16,950కి, లైబ్రెరియన్ జీతం రూ.13,660 నుంచి రూ.20,490కి, క్వాలిఫైడ్ స్టాఫ్ నర్స్ జీతం రూ. 11,530 నుంచి రూ.17,295కి నాన్ క్వాలిఫైడ్ స్టాప్ నర్స్ జీతం రూ. 9,200 నుంచి రూ. 13,800కి పెంచడం జరిగిందన్నారు. 
 
దళిత, గిరిజన విద్యార్ధులు ఉన్నతస్థాయికి ఎదగడానికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. క్రీడల్లో కూడా రెసిడెన్షియల్ విద్యార్ధులు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్ధులకు సన్న బియ్యం పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు ఈ విలేకర్ల సమావేశంలో శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments