Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువ హీరోపై మనసుపారేసున్న మలయాళ బ్యూటీ...

కోలీవుడ్ హీరోయిన నయనతార. ఇప్పటికే రెండు ప్రేమల్లో మునిగితేలి, ఆ తర్వాత వారితో తెగదెంపులు చేసుకుంది. ఇపుడు తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇంతలో మరో యువ హీరోపై ఆమె మనసు పారేసుకున్న

యువ హీరోపై మనసుపారేసున్న మలయాళ బ్యూటీ...
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (09:34 IST)
కోలీవుడ్ హీరోయిన నయనతార. ఇప్పటికే రెండు ప్రేమల్లో మునిగితేలి, ఆ తర్వాత వారితో తెగదెంపులు చేసుకుంది. ఇపుడు తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇంతలో మరో యువ హీరోపై ఆమె మనసు పారేసుకున్నట్టు కోలీవుడ్ వర్గా సమాచారం. ఆ యువ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్. 
 
ఈ యువ హీరో నటించిన తాజా చిత్రం వేలైక్కారన్. ఇందులో నయనతార హీరోయిన్. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ను నయనతార ఆకాశానికెత్తేస్తోంది. శివకార్తికేయన్ కూడా తన స్నేహితుల వద్ద నయనతార దండకం చదువుతున్నాడట. నయనతార ప్రత్యేకతలు, యాక్టింగ్ టాలెంట్ గురించి తెగపొగుడుతున్నాడట. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో నయనతార సహనటుడు శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ, అతను చాలా సరదా వ్యక్తి. షూటింగ్‌ స్పాట్‌‌లో ఆయన ఉంటే సందడికి ఏ మాత్రం కొదవ ఉండదు. ముఖ్యంగా పనిభారం, ఒత్తిడి అస్సలు తెలీదని తెలిపింది. ఒక వైపు నటిస్తూనే సెట్‌లో పని చేసే వారిని నవ్విస్తుంటారని తెలిపింది.
 
ఆయన అలా చేయడం వల్ల పని చేసేవారికి పని భారం తెలియదని చెప్పింది. ఇలాంటి ప్రత్యేకత శివకార్తికేయన్‌కు మాత్రమే ఉందని నయనతార అభినందిస్తోంది. ఇలా అభినందనలు కురిపించడానికి కారణం... ఆమెపై మనసు పారేసుకోవడం వల్లే ఇలా పొగడ్తల వర్షం కురిపిస్తోందనే విమర్శలు లేకపోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం టైటిల్ 'అజ్ఞాతవాసి'?