Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సినిమా థియేటర్లలో ధరల పెంపుపై....

అమరావతి: దేశవ్యాప్తంగా ఏకీకృత వస్తుసేవల పన్ను(జిఎస్టి) అమలులోకి వచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ సినిమా ధియేటర్లలో టికెట్ ధరల అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులుతో కూడిన కమిటీ సమావేశంలో చర్చించారు. సామాన్య ప్రజలక

ఏపీ సినిమా థియేటర్లలో ధరల పెంపుపై....
, గురువారం, 20 జులై 2017 (22:01 IST)
అమరావతి: దేశవ్యాప్తంగా ఏకీకృత వస్తుసేవల పన్ను(జిఎస్టి) అమలులోకి వచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ సినిమా ధియేటర్లలో టికెట్ ధరల అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులుతో కూడిన కమిటీ సమావేశంలో చర్చించారు. సామాన్య ప్రజలకు వినోదం భారం కాని రీతిలో ఎంతమేరకు సినిమా టెక్కెట్ల ధరలు పెంచాలనే దానిపై అధికారులుతో చర్చించారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని ఎసి ధియేటర్లు, ఎసి లేని ధియేటర్లు, అలాగే మల్టిప్లెక్సు దియోటర్లు, సింగిల్ స్క్రీన్ దియేటర్లు వంటి అన్ని ధియేటర్లలో ప్రస్తుతం ఉన్న ధరలు జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా ధియేటర్ల కేటగిరీని బట్టి ధరలు పెంపు అంశాలపై చర్చించారు.
 
సామాన్య,మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి భారం కాని రీతిలో ఈధరలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆప్రకారం ప్రతిపాదిత ధరల పెంపు అంశాల చర్చించగా తుది నివేదిక సిద్ధం చేసి ప్రకటించాలని హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్ అనురాధకు సిఎస్ దినేష్ కుమార్ సూచించారు.
 
ఇటీవల కాలంలో సినిమా ధియేటర్లలో మల్టీప్లెక్సుల్లో వివిధ శీతల పానీయాలు,ఇతర తినుబండారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వస్తున్న  ఫిర్యాదులు,మీడియాలో వస్తున్న కధలాపై ధియేటర్ల లైసెన్సింగ్ అధారిటీగా ఉన్న జాయింట్ కలక్టర్లు,పోలీస్ తదితర శాఖల అధికారులు అలాంటి వాటిపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అదేశించారు.అంతేగాక సినిమా ధియేటర్లలో తగిన భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతోపాటు,కనీస పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆయా లైసెన్సింగ్ అధారిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఎస్ స్పష్టం చేశారు.
 
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జాతీయ గీతాన్ని అన్ని ధియేటర్ల లోను సినిమా ప్రారంభానికి ముందు తప్పక ప్రదర్శించే విధంగా చూడాలని సిఎస్ ఆదేశించారు.అలాగే ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ పధకాల అమలుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డిసి),న్యూస్ రీల్స్ విభాగాలు రూపొందించి సరఫరా చేసే రెండు మూడి నిమిషాల వ్యవధితో కూడిన డాక్యుమెంటరీ ఫిలిమ్ లు మరియు షార్టు ఫిలిమ్ లను ఆయా ధియేటర్లలో సినిమా ప్రదర్శన ప్రారంభానికి ముందు సినిమా విశ్రాంతి సమయం(ఇంటర్వెల్)తర్వాత తప్పక ప్రదర్శించేలా చూడాలని సంబంధిత అధికారులను సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.
 
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.డి.సాంబశివ రావు, ఐటిశాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్.అనురాధ, సమాచారశాఖ కమీషనర్ మరియు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎండి ఎస్.వెంకటేశ్వర్, సమాచారశాఖ అదనపు సంచాలకులు మల్లాది కృష్ణానంద్,ఇంకా ఆర్ధిక,మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిరోడ్డుపై 11 మంది ఓ వ్యక్తిని కత్తులతో నరికేశారు..