Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్ సజ్జల ఎవడ్రా నువ్వు? ఆఫ్టరాల్ నువ్వొక జర్నలిస్టువి.. ఆర్ఆర్ఆర్ ఫైర్

Webdunia
సోమవారం, 10 మే 2021 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డిపై ఆ పార్టీకిచెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవడ్రా నువ్వు? అంటూ పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. రేయ్ సజ్జల ఎవడ్రా నువ్వు? ఆఫ్టరాల్ నువ్వొక జర్నలిస్టువి అంటూ ఘాటు మండిపడ్డారు. 
 
తనను టార్గెట్ చేసేందుకు మనుషులను నియమించాడని... సోషల్ మీడియలో ఇష్టానుసారం కామెంట్లు చేయిస్తున్నాడని మండిపడ్డారు. సజ్జల సూచన మేరకు తనకు ఒక వంద కాల్స్ వచ్చాయి జగన్ రెడ్డీ అని అన్నారు. 
 
నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ? నీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారని చెప్పారు. సజ్జలను బిజ్జల అంటూ సంబోధిస్తూ... బిజ్జల దిశానిర్దేశంతో తనను అసహనానికి గురిచేస్తూ, కేసులు వేద్దామని వాళ్లంతా ప్లాన్ చేశారని అన్నారు.
 
తనను ట్రాప్ చేయడానికి ఒక మహిళతో మెసేజ్‌లు పంపిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పతనావస్థలో ఉందని.. మీ కుట్రలన్నింటినీ త్వరలోనే బయపెడతానని హెచ్చరించారు. 
 
తన వ్యక్తిగత కార్యదర్శి ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని ఫిర్యాదు లేఖలో తెలిపానని చెప్పారు. రేయ్ సజ్జల ఎవడ్రా నువ్వు? ఆఫ్టరాల్ నువ్వొక జర్నలిస్టువి అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, రాష్ట్ర హోం మంత్రికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి, అన్నీ వ్యవహారాలను నువ్వే చూసుకుంటూ, అనధికార హోం మంత్రిగా వ్యవహరిస్తున్నావంటూ ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఈ అంశంపై నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
 
సజ్జలా పిచ్చిపిచ్చి వేషాలు వేయకు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించు, మీ వెధవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయని రఘురాజు హెచ్చరించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అహంకారాన్ని పక్కన పెట్టాలని... సీఎం జగన్, సజ్జల ఇద్దరూ వారి పరిధుల్లో ఉండాలని అన్నారు. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోవద్దని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments