దానిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సజ్జల

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:30 IST)
ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా ముందస్తు ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. దేశం మొత్తం ఒకే ఎన్నికలను తీసుకురావాలన్న ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గడంతో పాటు మార్పు వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తే..మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

 
ఎపి విషయానికొస్తే వైసిపి ముందస్తు ఎన్నికలను ఒప్పుకోవడం లేదు. కానీ టిడిపి మాత్రం సిద్థమంటోంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలకు సంబంధించి తాము సిద్థంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో ఎపి రాజకీయాల్లో వేడి రాజుకుంది

 
అయితే దీనిపై ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమకు ప్రజల అధికారాన్ని కట్టబెట్టింది ఐదేళ్ళు పాలించడానికేనన్నారు. ప్రజాతీర్పు మేరకు తాము పూర్తి కాలం పాలిస్తామన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే లేదన్నారు.

 
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందంటూ చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సజ్జల ఒక్కరే కాదు చాలామంది మంత్రులు ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ప్రభుత్వం సిద్థంగా లేదంటూ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments