Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్‌కు రూ.10 వేలు కట్టమంటున్నారు... చంద్రబాబు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైకాపా పాలకులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీటుగా కౌంటరిస్తున్నారు. మాటకు మాట రూపంలో సమాధానమిస్తున్నారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు గురువారం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో గట్టిగా కౌంటరిచ్చారు. 
 
ఓటీఎస్‌‍కు రూ.10 వేలు కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ఇలా డిమాండ్ చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయిస్తుందని హామీ ఇచ్చారు. 
 
పొరుగున ఉన్న తమిళనాడులో లీటరు పెట్రోల్ ధర మన రాష్ట్రంతో పోల్చితే రూ.10 తక్కువగా ఉందన్నారు. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నును తగ్గించేందుకు ఈ పాలకులకు మనస్సు రావడం లేదన్నారు. అంతేకాకుండా, నిన్నటివరకు తమ పార్టీ నేతలనే బూతులు తిట్టారు. ఇపుడు నాపైన కూడా బూతు పురాణం చదువుతన్నారంటూ మండిపడ్డారు. 
 
రౌడీయిజం చేయడం ఒక్క నిమిషం పని. కానీ, అది మన విధానం కాదని పార్టీ శ్రేణులతో ఆయన అన్నారు. అంతేకాకుండా, ఒక్క కుప్పంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలను, ఇబ్బందులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారి పేర్లను రాసిపెడుతున్నా... అందరి  లెక్కలను వడ్డీతో సహా తేల్చుతామని చంద్రబాబు వైకాపా నేతలకు కుప్పం వేదికగా వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments