Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి అక్షరాలా రూ.లక్ష కేటాయింపు!

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నవ్యాంధ్రపై ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర సర్కారు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత నెలలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అమరావతిలో సచివాలయ నిర్మాణానికి కేవలం లక్ష అంటే లక్ష రూపాయులు మాత్రమే కేటాయించింది. 
 
మొత్తం రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ లక్ష రూపాయల కేటాయింపులు చేసింది. గత యేడాది కూడా ఈ పద్దు కింద కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. 
 
నిజానికి ఏపీ ముంఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని ఎపుడో అటకెక్కించింది. మధ్యలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఈ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అధికారికంగా అమరావతేనని కేంద్రం కూడా గుర్తించింది. 
 
అదేసమయంలో అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (జీపీఏవో, కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోస భూమి కొనుగోలుకు కూడా కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. దీని కోసం ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ.4.48 కోట్లను ఖర్చు చేయగా, ఈ ఆర్థిక బడ్జెట్‌లో రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments