Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ప్రయాణీకులపై రూ.700 కోట్ల భారం

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:09 IST)
ఏపీఎస్ఆర్టీసీ పెంచిన ఛార్జీలు ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయనున్నాయి. ఏడాదికే రూ.700 కోట్ల మేర భారం పడనుంది. ఏపీఎస్‌ఆర్టీసీ పెంచిన బస్సు ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా దాదాపు రూ.700 కోట్ల మేర భారం పడనుంది.

రోజుకు సగటున రూ.2 కోట్ల మేర అదనంగా ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతం సంస్థకు ఏటా రూ.1200 కోట్ల మేర నష్టం వస్తోంది. పెంచిన ఛార్జీలతో కొంత మొత్తం సర్దుబాటు కానుంది. ఛార్జీల పెంపుదల నేపథ్యంలో ఆర్డినరీ సిటీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 కానుంది. పల్లెవెలుగులో దూరాన్ని బట్టి రూపాయి నుంచి గరిష్ఠంగా రూ.5 వరకు పెరగనుంది.

రాష్ట్రంలో నిత్యం 62 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో 20 లక్షల మంది విద్యార్థి పాస్‌లు గలవారే. మరో 30 లక్షల మంది పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో... మిగిలిన 12 లక్షల మంది ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రాడీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో వెళ్తున్నారు.

ఆర్టీసీకి రోజుకు సగటున వచ్చే రూ.13.5 కోట్ల ఆదాయంలో సగం పల్లెవెలుగు ద్వారా.. మిగిలిన సగం ఇతర సర్వీసుల ద్వారా వస్తోంది. దస్త్రాన్ని పంపిన అధికారులు ఛార్జీల పెంపునకు సంబంధించిన దస్త్రాన్ని ఆర్టీసీ అధికారులు సిద్ధం చేసి నిన్న ప్రభుత్వానికి పంపారు. ఉత్తర్వులు రాగానే నేటి అర్ధరాత్రి నుంచే ఛార్జీలు పెరగనున్నాయి. దాంతో టిక్కెట్‌ జారీ యంత్రాల(టిమ్‌)ను అప్‌డేట్‌ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసి ఉంచారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments