Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీ ఎంపీలకు కేంద్ర మంత్రుల సలహా!

Advertiesment
Union ministers
, సోమవారం, 9 డిశెంబరు 2019 (07:38 IST)
రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలపై జాతియ స్థాయిలో చర్చ జరుగుతుంది అని వైసీపీ అనుకూల మీడియా ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలను పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎంపీలను అడిగి బిజెపి ఎంపీలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అసలు విజయసాయి రెడ్డికి కాళీ ఉండటం లేదని నవరత్నాల పామ్‌ప్లేట్స్ పట్టుకుని తిరుగుతున్నారని… ఎవరికి తోచిన వార్తలు వాళ్ళు చెప్తున్నారు. అయితే అక్కడ జరుగుతుంది మాత్రం వేరే అంటున్నారు కొందరు. 
 
ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కొందరు వైసీపీ ఎంపీలు బిజెపి నేతలతో సావాసం చేస్తున్నారు అనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. బిజెపి పార్లమెంటరి హాల్ లో ఎంపీలు ఎక్కువగా కూర్చుంటున్నారు అనే ఫోటోలు కూడా మీడియాకు విడుదల అయ్యాయి. 
 
అసలు వాళ్ళు ఎందుకు కలిసారు అనే దాని మీద ఆరా తీస్తే కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో అమలు జరుగుతున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, మత ప్రచారానికి సంబంధించి కేంద్ర మంత్రులు వైసీపీ ఎంపీలకు కొన్ని సలహాలు ఇచ్చారట. 
 
ఇప్పుడు అప్పులు చేసుకుంటూ పోతే దివాలా తీస్తారని మీకు ఇవ్వడానికి కేంద్రం వద్ద కూడా డబ్బులు లేవని చెప్పారట. అలాగే.. .మత ప్రచార౦ మీరు ఎక్కువ చేయడం మీకే నష్టమని, సంఘ్ మీ మీద దృష్టి పెట్టిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పమని చెప్పారట.
 
అదే విధంగా మద్యం విషయంలో అనుసరిస్తున్న వైఖరి పెట్టుబడుల మీద ప్రభావం చూపిస్తుందని, అలాగే అప్పులు చేసి డబ్బులను వృధా చేయవద్దని ఇప్పటికే మీకు సంబంధించిన సమాచారం కేంద్రం వద్ద ఉందని, మీరు ఇదే కొనసాగిస్తే మాత్రం పాలన చేయడం కూడా కష్టంగా మారుతుందని, మీడియా విషయంలో, సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అని సూచించారట. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు కూడా కేంద్ర మంత్రులు వివరించారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ కొంటే ఉల్లిపాయలు ఉచితం