Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్.. బుల్లెట్స్ ఎలా దిగాయంటే...

Advertiesment
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్.. బుల్లెట్స్ ఎలా దిగాయంటే...
, ఆదివారం, 8 డిశెంబరు 2019 (17:42 IST)
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, నిందితుల మృతదేహాలకు జరిపిన పోస్టుమార్టం నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్ అతి సమీపం నుంచి జరిగినట్టు ఇందులో వెల్లడైంది. 
 
దిశ కేసు రీకన్‌స్ట్రక్షన్ దర్యాప్తులోభాగంగా నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు నిందితుల శరీరాల్లో 11 చోట్ల బుల్లెట్‌ గాయాలున్నట్లు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. 
 
ఘటనా స్థలంలోనే పోలీసులు బుల్లెట్‌ల కోసం వెతికినట్లు సమాచారం. ఫైర్‌ జరిగిన ప్రాంతంలో సెల్స్‌‌నైనా గుర్తించాలని ప్రయత్నించినట్లు తెలిసింది. అధికార యంత్రాంగం బుల్లెట్ల గురించి ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. 
 
పక్కా పోస్ట్‌మార్టమ్‌ అనంతరం అందిన పక్కా సమాచారం మేరకు పోస్ట్‌మార్టమ్‌లో మృతుల శరీరాల్లో చూస్తే ఏ ఒక్కరి దేహాంలో ఒక్క బుల్లెట్‌ కూడా రికవరి కాలేదని, అన్ని కూడా బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.  
 
మొదటి నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ శరీరంలో నాలుగు చోట్ల బుల్లెట్‌ గాయాలున్నాయి. రెండు ఛాతిలో, ఒకటి పక్కటెముకల్లో దిగినట్లు తెలిసింది. మరో బుల్లెట్‌ గాయం వీపు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. 
 
రెండో నిందితుడు శివ శరీరంపై మూడు బుల్లెట్‌ గాయాలున్నాయి. ఇందులో రెండు కిడ్నీ ప్రాంతంలో ఒకటి పుర్సల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది.
 
మూడో నిందితుడు ఏ-3 నిందితుడు నవీన్‌ దేహంలో మూడు చోట్ల బుల్లెట్‌ గాయలున్నాయి. ఇందులో ఒకటి తల లోంచి వెళ్లగా రెండు ఛాతిలోంచి వెళ్లినట్లు తెలిసింది. 
 
నాలుగో నిందితుడు చెన్నకేశవ శరీరంలో ఒకే తూటా దిగినట్లు సమాచారం. ఇతనికి గొంతు భాగంలోంచి తూటా వెళ్లినట్లు సమాచారం. కాగా ఎన్‌కౌంటర్‌ సమీపం లోంచి జరగడం వల్ల బుల్లెట్లు దేహంలో లేకుండా బయటకి వెళ్లినట్లు నిపుణులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం