Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి రూ.1,850 కోట్లు... విత్తమంత్రి నిర్మల ఆదేశం

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (17:25 IST)
గతంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డుకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ సొమ్మును సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పరిధిలో ఈ-ఆక్షన్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా బాండ్లను జారీ చేసింది నాబార్డ్.. దాంతో రూ.1,850 కోట్లు రావడంతో ఆ మొత్తాన్నిత్వరలోనే పీపీఏకు పంపనుంది. పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. 
 
కాగా గతేడాది జులైలో పోలవరానికి నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఆ తరువాత ఇదే ఇంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయడం విశేషం. కాగా, పోలవరం పనులకు ఇటీవల రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ.841.33 కోట్లు ఆదా అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments