తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. రేణిగుంట ఎయిర్ పోర్టులో సీఎంకు మంత్రులతో పాటు ఎమ్మెల్యే రోజా కూడా స్వాగతం పలికారు. తాజాగా ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు. రోజా ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్టుని సీఎం కూడా ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా పట్టు శాలువాతో సీఎంను రోజా సత్కరించారు. ఐతే ఆ శాలువాను చూసి సీఎం జగన్ సర్ ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆ శాలువాపై సీఎం జగన్ తో పాటు ఆయన తండ్రి,
Jagan_Roja
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ముద్రించి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ రంగులు, ఫ్యాన్ గుర్తులు ఉండేలా శాలువాను రూపొందించారు.
శాలువాను సీఎం జగన్ ఆసక్తిగా గమనించారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం SV కోయిల్ వీధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలతో పవర్ లూమింగ్ మిషన్ల యూనిట్ ను ఇటీవల రోజా ప్రారంభించారు. అక్కడి నేతన్నలు రూపొందించిన శాలువాలతో రోజా సీఎంను సత్కరించారు.
roja_jagan
నగరిలో చేనేత యూనిట్ ను ప్రారంభించిన సందర్భంగా రోజా కాసేపు మగ్గంపై కూర్చొని చీరనేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రాలతో కూడిన చీరను రోజా నేశారు. అలాగే తన చిత్రంతో ఉన్న చీరను కూడా రోజా ప్రదర్శించి మురిసిపోయారు.