Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారి దివ్యాలయంలో అద్భుత శక్తుల రహస్యాలు, ఏంటవి?

తిరుమల శ్రీవారి దివ్యాలయంలో అద్భుత శక్తుల రహస్యాలు, ఏంటవి?
, శనివారం, 9 అక్టోబరు 2021 (23:18 IST)
దేశంలో ఏ ఆలయంలో లేని సనాతన సంప్రదాయాలు.. ఏ ఆలయంలో లేని ఆధ్యాత్మిక విశిష్టత.. ఎక్కడా లేనన్ని ఉత్సవ మూర్తులు వైభవం, అనేక రకాల దివ్య శక్తులకు నిలయం ఆలయం.. అనేక రహశ్యాలకు కోలువైన దివ్యక్షేత్రం అది.. అందుకే ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనేది కాదు.. ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది నిత్యం వస్తుంటారు.. ఎన్ని సార్లు స్వామిని దర్శించుకున్నా తృప్తి నివ్వదు.. అలాంటి అద్బుత దివ్యాలయంలోని వినూత్న శక్తుల రహశ్యాలు ఏవి అవి ఎక్కడున్నాయి అని అనుకుంటున్నారా...? 
 
అవును మీరు ఊహించినదే.. ప్రపంచంలో ప్రసిద్ది గాంచిన విశిష్ట ఆలయం, శ్రీ వేంకటేశ్వరుడు స్వయంగా వెలసిన తిరుమల వైకుంఠ క్షేత్రం.. ఈ ఆలయంలో వున్నని పురాతన సంప్రదాయాలు, పూజా కైంకర్య విధానాలు, గర్భగుడిలో కోలువైనన్ని ఉత్సవ మూర్తులు దేశంలోనే కాదుగధా.. ప్రపంచంలో ఏ ఆలయంలో లేదు.. గర్బాలయంలో మూలవిరాట్‌తో పాటు అక్కడే కొలువైన ఐదుగురు దేవతామూర్తులకు నిత్యం ప్రత్యేక పూజలు, నివేదనలు జరుగుతాయి.
 
శ్రీవారి ఆలయంలో కొలువైన ఉత్సమూర్తులకు ఓక్కో మూర్తి ఒక్కోరకంగా పూజా విదానాలు నివేదనలు నిత్యం జరుగుతాయి.. అందుకే శ్రీవారికి నిత్యం ప్రత్యేక పూజా నివేదనలు చేసిన అర్చకులకు 16 సేర్ల బియాన్ని స్వామి వారు బుక్తిగా అర్చకులకు ప్రతిరోజూ ఇస్తారు.. అలా నిత్యం పూజలు అందుకుంటున్న దేవతామూర్తుల్లో మొదటిది దృవబేర, రెండోవది కౌతుకబేర, మూడోవది ఉత్సవబేర, నాల్గోవది ఉగ్రబేర, ఐదోవది బలిబేరగా ఐదు రకాల ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలయంలో కోలువై నిత్యపూజలు అందుకొంటున్నారు.
 
తరతరాల చరిత్ర గల శ్రీవారి ఆలయంలో స్వామి వారికి పూర్వం నుండి నేటి వరకు వైఖానస ఆగమోక్తంగా పూజా కైంకర్యలు జరుగుతున్నాయి.. శ్రీవారి ఆలయంలో దివ్యశక్తులు ఇమిడి ఉండటానికి పంచబేరాలు ఉండటమే ప్రధాన కారణం అని శ్రీవారి ఆలయంలో తరతరాలుగా పని చేస్తున్న అర్చకులు పేర్కోంటున్నారు.. తొమ్మిదన్న అడుగుల ఎత్తుగల శాలిగ్రామ విగ్రహం తిరుమల కొండపై స్వయంగా వెలిసింది.
 
దీన్నే దృవ బేరా అని అంటారు.. నిత్యం పూజలు అందుకొంటూనే వారానికి ఓక్కసారి ఈ విగ్రహానికి అర్చకులు ఆగమపండితులు అతి పవిత్రంగా అబిషేకాలను నిర్వహిస్తారు.. స్వయంగా స్వామి వారే విగ్రహం రూపంలో ఏర్పడినట్లు చరిత్ర చేపుతోంది.. అందుకే ఈ విగ్రహాన్ని ఆలయంలో పని చేసే ప్రదాన అర్చకుడు తప్ప మరేవరూ తాకరాదు అత్యంత శక్తి వంతమైన దివ్యస్వరూంతో కూడిన విగ్రహం అది.. ఎంతో పవిత్రతో కూడుకున్న పఛ్చకర్పూరంను స్వామి వారికి నుదుటన నామాలుగా ధరింపజేస్తారు.. ఈసంప్రదాయం శ్రీవారి ఆలయంలో తరతరాలుగా కొసాగుతున్నది..15 వందల సంవత్సరాల క్రితం సమవై అనే పల్లవరాణి సమర్పించిన 12 అడుగుల ఎత్తుగల వెండి విగ్రహం, బొగ శ్రీనివాసమూర్తి విగ్రహం ఇది.. శ్రీవారి గర్బాలయంలో మూలవిరాట్ పాదాల వద్ద ప్రతిష్టించారు.
 
అప్పటి నుండి నేటి వరకు 1500 ల సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకొంటున్నది.. దీన్నే కౌతుకబేర అంటారు.. ప్రతి రోజూ తోమాల సేవలో పాలు కుంకుమ అబిషేకాలు జరుగుతాయి.. అలాగే రాత్రి పూట ఏకాంత సేవ కూడ ఈ బొగ శ్రీనివాసమూర్తికే జరుగుతుంది.. అలాగే ప్రతి బుదవారం శ్రీవారి ఆలయంలో జరిగే సహశ్ర కళశాబిషేకం సేవ కూడ మూలవర్లకు ప్రతిబింబంగా ఈ స్వామికే జరుగుతుంది.. అర్చకులు ఎంతో నియమ నిష్టలతో అత్యంత పవిత్రంగా పూజా కైకర్యలు నిర్వహిస్తారు.. అయితే ఈ ఉత్సవ మూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు.. పూజా కైకర్యాలు అన్ని ఆలయంలోనే జరుగుతాయి.
 
శ్రీవారి ఆలయంలోని ఉత్సవ విగ్రహాల్లో భక్తులు ఎక్కవగా దర్శించుకునే ఉత్సవ విగ్రహాలు ఇవే.. వీటినే ఉత్సవ బేర అంటారు.. 600ల సంవత్సరాల క్రితం శ్రీమహవిష్ణువు అర్చకునిపై  ఆవహించి శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలోని ఒక లోయలో రహశ్య గుహ ఒకటి ఉంది దానిలో ఉన్న విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులుగా పూజా కైంకర్యాలు చేయాలని స్వామివారు నిర్దేశించారు.. దాని మేరకు అర్చకులు వెళ్ళి రహశ్యగుహలోని ఉత్సవమూర్తులను తెచ్చి ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.. అందుకే దీన్ని తమిళంలో ''మలై కని వుండ్రు పేరుమాల్'' అని పిలుస్తారు.. మలై అంటే కోండ వంగినలోయలోని లబించిన విగ్రహాలు అని అర్దం అందుకే వీటిని మనం మలయప్ప స్వామిగా పేర్కొంటుంటాం.
 
శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు,అలాగే నిత్య,వార, పక్షం,వార్షిక ఉత్సవాలన్నీ ఈ మలయప్పస్వామి వార్లకే జరుగుతుంది.. ఉత్సమూర్తులు లబించిన 'కాలమానతిథి' ప్రకారం నాటి నుండి నేటి వరకు ఏ ఆలయంలో లేని విధంగా ప్రతి రోజూ ఆలయం వెలుపలకు వచ్చి మాడవీదుల్లో ఊరేగుతూ స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తుంటారు.. మలయప్ప స్వామి లబించి గుహ నేటికి తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలో ఉంది.
 
ఇది చాలా రహశ్యమైంది.. ఆప్రాంతాన్ని నేడు వైకుంఠ తీర్ధంగా పిలుస్తుంటారు.. దేశంలో ఏ ఆలయంలో లేని ఉగ్రశ్రీనివాస మూర్తి ప్రతిమలు ఓక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే ఉన్నాయి.. దీన్నే ఉగ్ర బేర గా పేర్కోంటారు.. స్వామి వారు ప్రయోగ చక్రంతో శ్రీదేవి భూదేవిలతో భక్తులకు దర్శమిస్తారు.. అందువల్లే సూర్యొదయానికి ముందే తెల్లవారుజామున ఈ స్వామిని ఊరేగిస్తారు.. ప్రయోగచక్రం వలన నిత్యపూజలు అందుకొంటున్నా యోడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆలయం వెలుపలకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు.. కైశిక ద్వాదశి రోజున మాత్రమే స్వామి ఊరేగుతూ భక్తులకు దర్సమిస్తారు. 
 
 
శ్రీవారి ఆలయంలో తోమాల సేవ తరువాత బంగారు వాకిలి వద్ద ప్రతి రోజూ సంప్రదాయ బద్దంగా కుబేర శ్రీనివాసునికి కోలుపు జరుగుతుంది.. దీనినే బలిబేర అంటారు.. కొలువులో మొదట రోజు పంచాంగం శ్రవణం చేస్తారు.. అనంతరం శ్రీవారి హుండీ ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలను చదివి వినిపిస్తారు.. అలాగే భక్తులు ఇచ్చిన కానుకల వివరాలను అర్చకులు చదివి వినిపిస్తారు.. అలా ప్రతిరోజూ బలిబేర కోలువు తొమాల సేవ తరువాత జరుగుతుంది.
 
బలిబేరలో కుబే శ్రీనివాసునికి వివరాలన్ని చదివి వివరించిన అర్చకునికి బుక్తిగా 16 సేర్ల బియ్యాన్ని ప్రతిరోజూ శ్రీవారు ఇస్తారు..దీన్ని మాత్ర దానంగా అనుగ్రహిస్తారు.. శ్రీవారి ఆలయంలో కోలువైన కుబేర శ్రీనివాసుడు ఆలయంలో లోపల తప్ప బయటకు రాడు.. ఆలయంలో ఉంటూ నిత్య పూజా కైంకర్యాలు అందుకొంటుంటారు..ఇలా శ్రీవారి ఆలయంలో ఐదు రకాల ఉత్సవ మూర్తులు నిత్య పూజా కైంకర్యాలు అందుకోంటున్నందున ఆలయంలో విశిష్టమై దివ్యశక్తులు నెలకొన్నాయని అర్చకలు విశ్వశిస్తున్నారు.
 
మలయప్ప స్వామి లభించిన రహశ్యగుహ నేటికి ఉందని ప్రదాన అర్చకులకు పేర్కోంటున్నారు.. ఇలాంటి విశిష్ట దేవతామూర్తులు కొలువైవున్నందునే శ్రీవారి ఆలయంలో దివ్యశక్తులు నెలకొన్నాయి.. ఏ భక్తుడు వెళ్ళి స్వామిని దర్శించుకున్నా తిరిగి దర్శించుకోవాలన్నా ఆతృతే తప్ప బాగా దర్శించుకున్నామని సంతృప్తి ఉండదు.. అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-10-2021 నుంచి 16-10-2021 వరకు మీ వార రాశి ఫలితాలు