అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం సాయంత్రం వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
కరోనా నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణ వేదికలోనే నిర్వహించనున్నారు. వాహన సేవలు ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ తిరుమలలో పండుగ వాతావరణం నెలకొనేలా కొద్దిపాటి ఏర్పాట్లు చేశారు.
ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. గరుడసేవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.