Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 14 January 2025
webdunia

10-10-2021 నుంచి 16-10-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

Advertiesment
10-10-2021 నుంచి 16-10-2021 వరకు మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 9 అక్టోబరు 2021 (19:10 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
మీ ఓర్పునకు పరీక్షా సమయం. కలిసివచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. ఆది, బుధ వారాల్లో కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం, ధనలాభం. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వేడుకకు హాజరవుతారు. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. సమర్ధతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సోమ, గురు వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. విలువైన వస్తువులు జాగ్రత్త, వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్యూలు ఏమంత సంతృప్తినీయవు. సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వేడుకను ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు తలొగ్గవద్దు. పెట్టుబడులకు తరుణం కాదు. రిటైర్లు ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపాలు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. సెన్సెక్స్ లాభాల దిశగా సాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఈ వారం అనుకూలదాయకం. వాగ్దాటితో నెట్టుకొస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనకు అనుకూలం. చేతివృత్తులు, కార్మికులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
పట్టుదలతో కృషి చేస్తే విజయం తథ్యం. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆశావహదృక్పథంతో ముందుకు సాగుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆశించిన పదవులు దక్కవు. యత్నాలు విరమించుకోవద్దు. శుక్ర, శని వారాల్లో అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ శ్రమ వృధా కాదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. సోమ, మంగళ వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల కలయిక ఉత్తేజపరుస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. దైవదర్శనాలు, ప్రయాణం ఉల్లాసం కలిగిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. వీలైనంత వరకు సన్నిహితులతో కాలక్షేపం చేయండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. బుధ, గురు వారాల్లో పనులు సాగవు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
మీదైన రంగంలో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శుక్ర, శని వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. పెట్టుబడులు కలిసివస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు, విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. కళ, క్రీడా పోటీల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. వ్యవహారాలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అది, సోమవారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఖర్చులు అదుపులో ఉండవు. మంగళ, బుధ వారాల్లో ధన సమస్యలెదురవుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధ్యాయులకు కష్టకాలం. చేతివృత్తులు, ముఠా కార్మికులకు నిరాశాజనకం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరు వ్యాపారులకు బాగుంటుంది. దైవదర్శనాలు మనశ్శాంతినిస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. శనివారం నాడు పనులు సాగక విసుగు చెందుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. ఓర్పుతో మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. ఆప్తులతో గడిపేందుకు యత్నించండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-10-2021 శనివారం దినఫలాలు .. అమ్మ వారిని ఆరాధించిన...