Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-09-2021 నుంచి 25-09-2021 వరకు మీ వార రాశి ఫలితాలు (Video)

Advertiesment
19-09-2021 నుంచి 25-09-2021 వరకు మీ వార రాశి ఫలితాలు (Video)
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (23:36 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా పెరుగుతాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లోనుకావద్దు. నమ్మకస్తులే మోసగిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆప్తుల సలహా పాటించండి. పత్రాలు, నగదు జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు హోదామార్పు, వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారాలతో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అన్నిరంగాల వారికీ యోగదాయకమే. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ధనలాభం వుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. శుక్ర, శని వారాల్లో బాధ్యతగా వ్యవహరించాలి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య సఖ్యత వుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సంకల్పం సిద్ధిస్తుంది. ఆదాయానికి తగినట్లు ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పరిచయస్తులు ధనసాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పొదుపు పథకాలు కలిసివస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు వదులుకోవద్దు. ఆది, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. యోగా ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. కంప్యూటర్ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యం. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చిన్న వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. గురువారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయివ వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరగ్యం స్థిరంగా వుంటుంది. గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారాలతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఏ విషయంపై ఆసక్తి వుండదు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పట్టుదలతో శ్రమించినా గాని పనులు కావు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా వుండవు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. సన్నిహితుల రాక ఉత్తేజాన్నిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. మరమ్మతులు, నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు కష్టకాలం. వ్యాపారాలు ఆశించినంతగా సాగవు. హోల్‌సేల్ వ్యాపారులకు నిరుత్సాహకరం. న్యాయ, వైద్య, అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురు, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. సంస్థల స్థాపనకు తరుణం కాదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఈ వారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు అదుపులో వుండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులు కలిసిరావు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరక వుండదు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలనే కొనసాగించండి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆర్థికస్థితి సామాన్యం పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆకస్మిక ఖర్చులెదురవుతాయి. అవసరాలకు అతికష్టంమీద ధనం సర్దుబాటవుంది. కొత్త పనులు చేపడతారు. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆప్తులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు  అంతంత మాత్రంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమివ్వదు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
మీ మాటే నెగ్గాలనే పంతం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు, ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా వుండేందుకు యత్నించండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆత్మియులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు సామాన్యం. షాపు పనివారలతో జాగ్రత్త. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారించండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి సామాన్యం. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కష్టకాలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సభ్యత్వాలు, దీక్షలు స్వీకరిస్తారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-09-2021 శనివారం రాశిఫలాలు - శనికి తైలాభిషేకం చేయించినా...