Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-08-2021 నుంచి 04-09-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

Advertiesment
29-08-2021 నుంచి 04-09-2021 వరకు మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 28 ఆగస్టు 2021 (22:13 IST)
Astrology
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు రూపొందించుకుంటారు. డబ్బుకు ఇబ్బంది వుండదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోమ, మంగళ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పట్టుదలతో శ్రమించినా గానీ పనులు పూర్తికావు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు కలిసివస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. రవాణా, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఉపాధ్యాయులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సైతం చేరువవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. దుబారా ఖర్చులు విపరీతం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం మంచిది. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దురుసుతనం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. అధికారులకు బాధ్యతల మార్పు, ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. పెద్దల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విరివిగా వ్యయం చేస్తారు. సంతానం మొండి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్వాగతం పలుకుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గురు, శుక్ర వారాల్లో తొందరపడి హామీలివ్వవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ప్రైవేట్, విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. భవన నిర్మాణ కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం 
అనుకూలతలు నెలకొంటాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. జాతక పొంతన ప్రధానం. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పత్రాల రెన్యువల్‍‌లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
కార్యం సిద్ధిస్తుంది. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. అభియోగాలు తొలగిపోగలవు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆది, మంగళ వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. దూకుడుగా వ్యవహరించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగా వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. మనశ్సాంతి వుండదు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పట్టుదలతో శ్రమించినా గాని పనులు పూర్తి కావు. బుధ, గురువారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. ముఖ్యులతో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
లక్ష్యం సిద్ధిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగువేస్తారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. పెద్దమొత్తం ధనసాయం తగదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం పై చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-08-2021 శనివారం దినఫలాలు - నవగ్రహ పారాయణం...