Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వూరు ప్రమాదంలో పెరుగుతున్న మృతులు: ఐదుకి చేరిన మృతుల సంఖ్య

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (14:58 IST)
నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి మృత్యువు దూసుకొచ్చి ఐదుగురిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. సంగం మండలం దువ్వూరు వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు- ముంబయి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొనడంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 
నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతి చెందిన వారిని దువ్వూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు(55), టి. రమణయ్య(60), కె. మాలకొండయ్య(50), జి. శీనయ్య(50), మోచర్ల శీనయ్యగా గుర్తించారు. కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ 14 మంది ఆటో ఎక్కబోతుండగా వెనకవైపు నుంచి వచ్చిన వ్యాను ఆటోను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందటంతో పాటు వ్యాను డ్రైవరుతో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
 
క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డి పాలెం సీఐ సురేష్‌ బాబు, సంగం ఎస్‌ఐ కె. శ్రీకాంత్‌ ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments