Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి

Advertiesment
అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి
, బుధవారం, 27 జనవరి 2021 (11:55 IST)
చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చుక్క వారి పల్లి సమీపంలోని శ్రీ సిద్ధగిరి క్షేత్రం శ్రీ భగవాన్ రామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగుల్లో ఒకరు స్వామిజీని హతమార్చినట్లు అదే ఆశ్రమంలోని మహిళా వృద్ధురాలు చెబుతున్నారు.

ఆ దుండగుడు తనపై కూడా అత్యాచారయత్నానికి ప్రయత్నించాడి... తప్పించుకుని ముళ్లపొదల్లో దాక్కున్నట్లు ఆమె తెలిపారు. స్వామీజీ అనుమానాస్పద మృతిలో మరో కోణం వినిపిస్తోంది. శ్రీవారి భక్తులకు అన్నదానం చేసేందుకు అచ్యుతానంద స్వామి కొనుగోలు చేసిన భవన వివాదమే ఆయన ప్రాణం తీసిందని సోదరుడు ఆరోపిస్తున్నారు. 

శ్రీవారి భక్తులకు అన్నదానం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పూతలపట్టు మండలంలోని మిట్టూరు వద్ద ఒక భవనాన్ని స్వామీజీ కొనుగోలు చేశారు. సంవత్సరాలు గడిచినా ఇంటిని అమ్మిన వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో హత్యకు దారితీసి ఉంటుందని స్వామీజీ సోదరుడు శ్రీరాములు రెడ్డి చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీలో మూడువేలకు పైగా ఉద్యోగాల భర్తీ.. ఫేక్ న్యూస్