Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధాపై రెక్కీ నిజ‌మేనా? ఆధారాల్లేవంటున్న పోలీస్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (15:37 IST)
వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని పోలీసులు తేల్చిపారేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు వంగ‌వీటి ఎందుక‌లా ప్ర‌క‌టించారు? ఆయ‌న ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయి? అవి దేనికి సంకేతాల‌నే మీమాంస‌లో తెలుగుదేశం నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 

 
వంగ‌వీటి మోహ‌న రంగా వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగ‌వీటి రాధా ఈ రెక్కీ బాంబు పేల్చారు. త‌న‌ను చంప‌డానికి రెక్కీ కూడా నిర్వ‌హించార‌ని ఆయ‌న వేదిక‌పై వెల్ల‌డించారు. స‌రిగ్గా అదే స‌మ‌యానికి మంత్రి కొడాలి నాని ఇటు, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అటు ... మ‌ధ్య‌లో రాధా ఉండ‌టం విశేషం. పైగా ఆయ‌న చేసిన కామెంట్స్ ఎవరిపైన అనేది కూడా వంగ‌వీటి రాధా స్ప‌ష్టం చేయ‌లేదు. దీనితో ఎవ‌రు ఆయ‌న‌పై హ‌త్యకు రెక్కీ చేశార‌నేది వివాదంగా మారింది. ఇది తెలుసుకునేందుకే టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా వంగ‌వీటి రాధా ఇంటికి కూడా వెళ్ళి వచ్చారు. ఏది చేసిన వ్య‌క్తిగ‌తంగా కాకుండా, పార్టీ త‌ర‌ఫున చేద్దామ‌ని చెప్పి మ‌రీ వ‌చ్చారు.
 
 
అయితే, వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా అన్నారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నామని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు. అయితే ఈ ఘటనపై అవాస్తవాలు ప్రసారం చేయొద్దని అన్నారు. ప్రతిపక్ష నేత వాస్తవాలు తెలుసుకోకుండా డిపార్టుమెంట్‌పై ఆసత్యలు మాట్లాడారని అన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదని, పోలీసు అధికారులు రాధాతో మాట్లాడరని తెలిపారు. ఎలాంటి అఫెన్స్ జరగనప్పడు, క్రిమినల్ యాక్టివిటీ లేనపుడు కేసు ఎలా పెడతామని అన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments