Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (12:18 IST)
మాజీ మంత్రి ఆర్కే రోజాను త్వరలోనే అరెస్టు కాబోతున్నారంటూ శాఫ్ చైర్మన్ రవి నాయడు జోస్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. క్రీడా సామాగ్రి కొనుగోళ్లలో రూ.119 కోట్లకు పైగా నిధులు పక్కదారిపట్టించారని తెలిపారు. అలాగే, తిరుమల టిక్కెట్ల దందాలో రూ.కోట్లు వెనకేసుకున్నారని తెలిపారు. నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. విచారణలో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రోజా భయపడుతున్నారని తెలిపారు. రోజా అరెస్టు పక్కా అని ఏ క్షణమైనా ఆమెను అరెస్టు చేయొచ్చన రవి నాయుడు పేర్కొన్నారు. 
 
పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు 
 
వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి మాట్లాడుతూ, ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారంటూ వ్యాఖ్యానించారు. 
 
బిల్లుపై విపక్ష పార్టీ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. పార్లమెట్ ఉభయ సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు. మొత్తం 284 మంది ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయి. మేం బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు తీసుకునిరాకపోతే కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. 
 
అలాగే, వక్ఫ్ బిల్లు ముస్లిం సమజానికి చెందిన మత విశ్వాసాలకు ఎలాంటి ఆటంకం లేదా విఘాతం కలిగించదని ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయం మాత్రమే అని, ఈ బిల్లు మద్దతు ఇచ్చేవారు, వ్యతిరేకించేవారూ ఎప్పటికీ గుర్తుండిపోతారని, పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలని వారిని అలా వదిలివేయకూడదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments