Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితోటలో రేవ్ పార్టీ... నర్తకి కమ్ గాయని.. నలుగురు అమ్మాయిలు అరెస్టు

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:37 IST)
హైదరాబాద్ నగరంలోని శివారు తోటలు, ఫామ్‍హౌస్‌లు, రెస్టారెంట్లలో రేవ్ పార్టీలు జరగడం సర్వసాధారణంగా మారింది. దీంతో పోలీసులు జరిపే ఆకస్మిక తనిఖీల్లో అనేక మంది అమ్మాయిలతో పాటు విటులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మామిడితోటలో కొందరు రేవ్ పార్టీని ఏర్పాటుచేశారు. ఈ పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఓ గాయని పంపించారు. చివరకు ఈ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్‌కు చెందిన హమీద్ ఖాన్ అనే వ్యక్తి, తన ఫామ్‌హౌస్‌లో బర్త్ డే వేడుకలకు ప్లాన్ చేసి, రేవ్ పార్టీ పెట్టి మిత్రులను ఆహ్వానించాడు. ఈ పార్టీకి కావాల్సిన అమ్మాయిలను సరఫరా చేసేందుకు నర్తకి, గాయని దీపాశెట్టిని సంప్రదించారు. పార్టీలో బెల్లీ డ్యాన్స్ ఆపై వ్యభిచారం చేసేందుకు నలుగురు డ్యాన్సర్లు కావాలని చెబుతూ ఒక్కొక్కరికి రూ.15 వేలు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నాడు.
 
ఆపై ఆదివారం రాత్రి దీపాశెట్టి, నలుగురు అమ్మాయిలతో కలసి హమీద్ ఏర్పాటు చేసిన ఇన్నోవా (టీఎస్12జీ 5890)లో మామిడితోట వద్దకు చేరుకుంది. ఒంటిగంట సమయంలో వారంతా డీజే సౌండ్‌లో పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు ఆలకించారు. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని గ్రహించిన పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్న దీపాశెట్టితోపాటు నలుగురు యువతులను, హమీద్‌ఖాన్‌, అతని ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. అమ్మాయిలను తుక్కుగూడలోని ప్రజావాలా హోమ్‌‌కు, నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments