కొరటాల శివ. మిర్చి సినిమాతో దర్శకుడుగా పరిచయమై తొలి చిత్రంతోనే బ్లాక్‌బష్టర్‌ను సొంతం చేసుకుని ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుసగా బ్లాక్ బష్టర్స్ అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. తన సినిమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చే కొరటాల సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉండాలంటారు. ఇంతకీ విషయం ఏంటంటే... తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్‌లో చాలా తక్కువ శాతం పొలింగ్ నమోదైంది.
హైదరాబాదీలు ఈ సారి కూడా బద్దకించారు. సెలబ్రిటీలు తమ పనులు మానుకుని ప్లాన్ చేసుకుని మరీ ఓటు వేయడానికి వస్తుంటే... సామాన్య హైదరాబాదీలు మాత్రం చాలా బద్దకించారు. గత ఏడాది కంటే పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఇది కొరటాలకు కోపం తీసుకువచ్చింది.
అర్బన్ ఓటర్... షేమ్ ఆన్ యు.. అంటూ కొరటాల శివ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు రోజు ఓటు వేయండి అంటూ కొరటాల శివ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు అనేక మంది సెలబ్రిటీలు కూడా ఓటు వేయండి అని జనాలను కోరారు. చాలా రోజుల నుంచి ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి సెలవు ఇప్పించినా అర్బన్ ఓటరు అస్సలు ఇంటి నుంచి కదల్లేదు. మరి.. ప్రజలందరిలో మార్పు ఎప్పుడు వస్తుందో..?