Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భందాల్చిన ప్రేయసిని చంపేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (17:07 IST)
గర్భందాల్చిన ప్రియురాలని చంపేసిన ప్రియుడు... ఈ హత్య కేసు నుంచి బయటపడేందుకు భారీ స్కెచ్ వేసి అడ్డంగా చిక్కాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన రాణిశిభ (22) అనే యువతి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడి మాయమాటలు నమ్మి శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో ఆ యువతి గర్భందాల్చింది. అప్పటికే ఆరు నెలల గర్భవతి అయింది. దీంతో అబార్షన్ చేయిద్దామని ఆమెను ప్రియుడు ఒప్పించాడు. మాతోశ్రీ ఆసుపత్రిలో అబార్షన్‌ చేసే సమయంలో వైద్యం వికటించి ఆమె మృతి చెందింది.
 
ఈ విషయం బయటకురాకుండా ఉండేందుకు మృతురాలి ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి కర్నాటక నుంచి మృతదేహాన్ని కారులో తీసుకొచ్చారు. గోవిందాపూర్‌ తండా గేట్‌ సమీపంలో హైదరాబాద్ ‌- బీజాపూర్‌ రోడ్డు పక్కన కాలువలో పడేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి, గుర్తుతెలియని శవంగా చిత్రీకరించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా శవానికి ఉన్న బట్టముక్కలు, కారుటైర్లు, పెట్రోలు తెచ్చిన బాటిళ్ల ఆధారంగా పోలీస్‌లు గుర్తించారు. మృతురాలిది కర్నాటక రాష్ట్రంలోని బ్రహ్మపూర్‌‌గా గుర్తించారు. ప్రియురాలిని కాల్చివేసేందుకు పెట్రోల్ తెచ్చిన బాటిలే హంతకుడిని పట్టించింది. దీంతో నిందితుడుని అదుపులోకి తీసుకుని కేసును బ్రహ్మపూర్‌కు మార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం