Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ వర్షాలకు అవకాశం

Webdunia
శనివారం, 11 జులై 2020 (15:51 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి దక్షణ ఒడిస్సా వరకు ఛత్తీస్‌గడ్ మీదుగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఉత్తర కోస్తాలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. అంతేకాకుండా సోమవారం కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇదే పరిస్థితి కనబడుతున్నది. ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments