68 ఏళ్ల భార్యపై అనుమానం.. చెయ్యి విరగ్గొట్టిన వృద్ధుడు..

Webdunia
శనివారం, 11 జులై 2020 (14:52 IST)
భార్యపై అనుమానం పెంచుకున్న వృద్ధుడు.. ఆమెతో రోజూ గొడవకు దిగేవాడు. అయితే ఆ వృద్ధుడు అనుమానిస్తున్న వ్యక్తికి ఆమె కొడుకు వయస్సు ఉంటుంది. అయినా ఆరు పదుల వయస్సు దాటిన భార్య చెయ్యిని విరగొట్టాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి (78) సెక్రటేరియట్‌లో మాజీ ఉద్యోగి. తన భార్య (68)తో కలిసి నివసిస్తున్నాడు. 
 
ఇంటిలో ఇద్దరు మాత్రమే ఉండడం.. పెద్ద ఇల్లు కావడంతో మరో వ్యక్తి (44)కి అద్దెకు ఇచ్చారు. ఆ వ్యక్తి తన భార్య(34)తో కలిసి ఆ ఇంటిలోనే అద్దెకు ఉంటున్నారు. అయితే ఆ వ్యక్తి భార్య గర్భిణీ కావడంతో డెలివరీ కోసం జనవరిలో పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆమె భర్త ఒంటరిగా ఉంటూ వండుకుని తింటున్నాడు. కానీ అతడికి వంటలు సరిగా చేయరాకపోవడాన్ని గమనించిన వృద్ధ మహిళ అతడికి వంట, ఇంటి పనిలో సాయపడేది. 
 
ఈ క్రమంలో 78 ఏళ్ల వ్యక్తి వృద్ధ మహిళ అయిన భార్య ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమానంతో భార్యతో గొడవపడేవాడు. అయినా ఆ యువకుడికి వృద్ధ మహిళ సాయపడటం ఆపలేదు. దీంతో ఆవేశానికి గురైన వృద్ధుడు ఒక రోజు భార్యతో గొడవపడి వృద్ధురాలు అని చూడకుండా ఆమె చెయ్యి విరగొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచాడు. ఇక ఆ వృద్ధ మహిళ పరిహార్ హెల్ప్ డెస్క్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments