Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న కారులో వ్యభిచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (17:45 IST)
దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఆధ్మాత్మిక ప్రాంతం తిరుపతి కొంతమంది అసాంఘిక వ్యక్తులకు అడ్డాగా మారిపోయింది. డబ్బులను సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ తిరుపతి లాంటి ప్రాంతాన్ని అడ్డాగా మార్చేసుకుంటున్నారు. 
 
ఇప్పటివరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాలను నడిపేవారు కొంతమంది నిర్వాహకులు. అయితే పోలీసుల రైడింగ్ ఎక్కువైపోవడంతో బరితెగించేశారు. ఏకంగా కారులోనే వ్యభిచారాన్ని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
 
ఎం.ఆర్.పల్లి పోలీసులు తిరుపతి - చిత్తూరు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారానికి ఒకసారి వాహనాలను పోలీసులు యధావిధిగా తనిఖీలు చేస్తున్నారు. ఒక ఇన్నోవా కారులో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు కనిపించారు. వారిని చూస్తే భక్తులలా కనిపించలేదు. దీంతో అనుమానంతో వారిని విచారించారు.
 
అందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కదిలే కారులో వ్యభిచారం చేసే బిజినెస్‌ను ప్రారంభించినట్లు పోలీసులకు తెలిపారు. ఇద్దరు మహిళలు వైజాగ్‌కు చెందిన వారే. దీంతో ముగ్గురు విటులను, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇన్నోవా కారుతో పాటు మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments