ప్రణయ్ పరువు హత్య.. ఉక్రెయిన్ నుంచి సోదరుడు.. వదినకు ఓదార్పు

ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో కులంలో తక్కువ వాడైనప్పటికీ తనకు వ్యతిరేకంగా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మామ కక్షకు బలైన ప్రణయ్‌ హత్యను తెలంగా

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (17:00 IST)
ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో కులంలో తక్కువ వాడైనప్పటికీ తనకు వ్యతిరేకంగా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మామ కక్షకు బలైన ప్రణయ్‌ హత్యను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. అమృత, ప్రణయ్ తల్లిదండ్రులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
 
మరోవైపు ప్రణయ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు, స్థానికులు, దళిత, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేస్తున్న అజయ్ సోదరుడు మరణించిన విషయం తెలుసుకొన్న వెంటనే మిర్యాలగూడకు వచ్చాడు. ప్రణయ్ భౌతికకాయాన్ని చూడగానే కన్నీరుమున్నీరయ్యాడు. తల్లిదండ్రులను, వదినను ఓదార్చాడు.
 
కాగా స్కూల్ నుండే అమృతవర్షిణితో ప్రణయ్‌కు పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అమృత తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ప్రణయ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే తన బిడ్డ కడుపుతో వున్నా.. పరువే ముఖ్యమని అమృత తండ్రి ప్రణయ్‌ని హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. పోలీసులు మాత్రం ఇంకా నిందితులు తమ అదుపులో లేరని.. పరారీలో వున్న వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments