విమానంలో లవ్ ప్రపోజల్.. ఊడిన ఉద్యోగం.. ఎలా?

విమానంలో లవ్ ప్రపోజల్ చేశాడు.. అంతే ఉద్యోగం ఊడిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత విమానంలోని ఎయిర్ హోస్టెస్‌కు ఆమె బాయ్‌ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేశాడు. ఉన్నట్టుండి బాయ్‌ఫ

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (16:25 IST)
విమానంలో లవ్ ప్రపోజల్ చేశాడు.. అంతే ఉద్యోగం ఊడిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత విమానంలోని ఎయిర్ హోస్టెస్‌కు ఆమె బాయ్‌ఫ్రెండ్ లవ్ ప్రపోజ్ చేశాడు. ఉన్నట్టుండి బాయ్‌ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక షాక్‌కు గురైంది.


తర్వాత మనోడి ప్రపోజల్ నచ్చి ఓకే చెప్పింది. వాళ్ల ప్రేమ సక్సెస్ అయ్యింది కానీ విమానంలో జరిగిన ఈ ఘటన వల్ల ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మేలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఎయిర్‌హోస్టెస్ విధులు సక్రమంగా నిర్వర్తించలేదని సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ ఉద్యోగం నుంచి ఆమెను పీకేసిందట. విమానంలో ప్యాసెంజర్ల బాగోగులు చూడకుండా వ్యక్తిగత పనులు చూసుకోవడం సరికాదని సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ వివరణ ఇచ్చిందట. 
 
ఎయిర్‌హోస్టెస్‌కు ఆమె బాయ్‌ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తుండగా కొంతమంది వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ విషయం కాస్త ఎయిర్‌లైన్స్ అధికారులకు తెలియడంతో ఆమె ఉద్యోగం ఊడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments