Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో మంగళవారం చర్చ జరగనుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ శ్రేణులు పోలీసులపై రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సమావేశాల్లో రెండో రోజు భాగంగా అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 
 
గరుడా కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని గామాల్లో బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రత్తమయ్యారు. రాజధాని గ్రామాల్లో తలదాచుకున్న అరాచకశక్తుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని రాజధాని ప్రాంత వాసులకు పోలీసులు సూచించారు. నిరసనలు ఎవరి గ్రామాల్లో వారు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments