Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పోలీసు రాజ్యం: వర్ల రామయ్య

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:22 IST)
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.

ఎన్నికల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉండగా.. డీజీపీ గౌతం సవాంగ్‌ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ మాత్రమే రాజ్యమేలుతోందని ఆరోపించారు.

కుప్పంలో పోలీసుల తీరుపై ఆయన బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ మంగళవారం రాత్రి 10.45 గంటలకు కుప్పంలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని, 41 నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. 

డీజీపీ నేతృత్వంలో అధికార పార్టీ స్థానికంగా ఏది చెబితే అదే చేస్తున్నారని, ఆ పద్ధతి మంచిది కాదని హితవు పలికారు.

అధికార పార్టీ చెప్పిందల్లా చేస్తే భవిష్యత్‌లో పోలీసులు ఇబ్బంది పడతారని వర్ల రామయ్య హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments