Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ కేసులో నిందితుడు అరెస్ట్: షమీకి సపోర్ట్ చేయడంతో..?

Advertiesment
Farhan Akhtar
, బుధవారం, 10 నవంబరు 2021 (18:36 IST)
భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన రామ్ నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబైకి తరలించారు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో రామ్ నగేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. కోహ్లి కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన 23ఏళ్ల అలిబత్తిని రామ్ నగేష్ ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. భారత బౌలర్ మహ్మద్‌ షమీకి సపోర్ట్‌ ఇచ్చినందుకు కోహ్లిని బెదిరించాడు రామ్ నగేశ్.
 
టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని చవి చూసింది. ఈ ఓటమిని భారత జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా, కొందరు హద్దులు మీరారు. ఓటమిని సహించలేని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్​కు పాల్పడ్డారు. ప్రధానంగా పేసర్ మహ్మద్​ షమీని టార్గెట్ చేశారు. షమీని బూతులు తిట్టారు. అంతేకాదు మతపరమైన దూషణకు దిగారు. 
 
ఈ క్రమంలో షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. దీంతో కొందరు నెటిజన్లు కోహ్లిపై విరుచుకుపడ్డారు. నీచమైన కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా కోహ్లి భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికను ఇందులోకి లాగారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. 
 
అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో పలువురు సామాజిక వేత్తలు మండిపడ్డారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమిషన్. అతి చేసిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన రామ్ నగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 క్రికెట్‌ నుంచి కూడా కోహ్లి రిటైర్ అవుతాడు.. అహ్మద్ కామెంట్