Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కె.సి.ఆర్‌.గారి పాత్ర‌లో న‌టించ‌డం గ‌ర్వంగా వుంది - జిషాన్ ఉస్మాన్

Advertiesment
God of Telangana
, బుధవారం, 10 నవంబరు 2021 (18:34 IST)
Zishan Usman
తెలంగాణ ఉద్యమ నాయకుడు కె.సి.ఆర్‌.గా శ్రీకాంత్ న‌టించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. కె.సి.ఆర్‌. యువ‌కుడిగా వున్న పాత్ర‌ను జిషాన్‌ ఉస్మాన్ పోషించారు. తొలిసారిగా వెండితెర‌కు ఉస్మాన్ ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్‌ వడత్యా దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు జిషాన్ ఉస్మాన్ చిత్రం గురించి ఇలా తెలియ‌జేశారు.
 
- నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు దర్శకుడు హరీష్ గారు వచ్చి నన్ను కలసి నీతో సినిమా చేయాలనుకుంటున్నాను అన్నారు మా నాన్న గారితో కూడా ఇదే విషయం చెప్పగానే ఆయన కూడా సరే అన్నారు.. అప్పుడే డైరెక్టర్ తెలంగాణ దేవుడు కథ నాకు వినిపించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి బయోపిక్ అని తెలిసి కథ బాగా నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను.
 
- ఈ పాత్రలో నటించడానికి మీ ఇన్స్పిరేషన్ మ‌న‌ సీఎం కె సీ ఆర్ గారే.. ఆయన ఒక ఉద్యమకారుడుగా అప్పుడు పోరాడిన విధానం అందరికీ తెలిసిందే. అదే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ పాత్రలో  నటించి నందుకు చాలా గర్వాంగా కూడా ఉంది.
 
- ఒకప్పుడు అంతగా తెలియదు తెలంగాణ గురుంచి.. కానీ కథ విన్న తరువాత బాగా తెలుసుకున్నాను..
 
- ఈ సినిమాలో నాకు జంటగా సుష్మిత నటించింది. ఈ సినిమాలో నా పాత్ర కూడా స్కూలింగ్ నుంచి మ్యారేజ్ అయ్యే వరకు ఉంటుంది.
 
- ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేస్తాన‌ని ఊహించ‌లేదు.  తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగారి పాత్రలో నటించడం చాలా గర్వంగానూ,  ఛాలెంజింగ్ గా అనిపిస్తోంది.. ఎందుకంటే కె సి ఆర్ గారు ఒక ఉద్యమకారుడిగా చాలా పోరాడి గెలిచారు అలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం నిజంగా గర్వంగా అనిపిస్తోంది.
- ఈ సినిమా త‌ర్వాత నేను యు.ఎస్‌.లో యాక్టింగ్ కోర్సును అభ్య‌సించి వ‌స్తాను. ఇప్ప‌టికే ప్రేమ‌క‌థ‌లు కొంద‌రు వినిపిస్తున్నారు. ఏడాది త‌ర్వాత పాత్ర‌ప‌రంగా అందుకు స‌రిపోతాను. సినిమాలు చేయాల‌నేదే నా కోరిక‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ, శ్రుతీ హాసన్ మూవీ ముహూర్తం ఖ‌రారు