Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్నే ప్రేమిస్తున్నానంటూ బాలికను రేప్ చేసిన కానిస్టేబుల్...

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (18:29 IST)
రక్షించాల్సిన పోలీసే కామాంధుడిగా మారాడు. అభంశుభం తెలియని మైనర్ బాలికను భయపెట్టి 8 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కానిస్టేబుల్ కావడంతో అతన్ని సస్పెండ్ చేసి విషయం బయటకు పొక్కనీయకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తపడుతున్నారు.
 
విజయవాడ సమీపంలోని కానూరుకు చెందిన ఎఆర్ కానిస్టేబుల్ బండి హరి తన ఇంటి పక్కనే ఉన్న మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ప్రేమ పేరుతోనే కాకుండా తను పోలీసు.. చంపేస్తానంటూ బెదిరించి 8 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలిస్తే చంపేస్తాడేమోనన్న భయంతో బాలిక సైలెంట్‌గా ఉంటూ వచ్చింది.
 
అయితే నిన్న వీరిద్దరు కలిసి ఉండడాన్ని తల్లిదండ్రులు కళ్ళారా చూశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వెంటనే కమిషనర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు కానీ.. విషయం బయటకు చెప్పొద్దంటూ ఆయన రిక్వెస్ట్ చేశారని బాధితులు చెపుతున్నారు. అయితే బాధితురాలు తల్లిదండ్రులు మాత్రం కానిస్టేబుల్ నిర్వాకాన్ని మీడియాకు పూసగుచ్చినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments