Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బహిర్భూమికెళ్లిన బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు పిల్లల కామాంధుడు

Advertiesment
Guntur
, గురువారం, 31 జనవరి 2019 (09:21 IST)
గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ బాలిక బుధవారం రాత్రి బహిర్భూమికి వెళ్లగా ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని రెంటచింతల ప్రాంతంలో జరిగింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రెంటచింతల గ్రామానికి చెందిన రెండో తరగతి చదువుతున్న ఓ బాలిక మంగళవారం రాత్రి ఒంటరిగా బహిర్భూమికెళ్లింది. ఆ బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న మిర్యాల జయరావ్ (25) అనే కామాంధుడు కంట పడింది. 
 
రాత్రి సమయంకావడంతో కాస్త చీకటిగా ఉండటంతో ఆ బాలిక వెనుకనే వెళ్లి, నోరు గట్టిగా అదిమిపట్టి ముళ్ళ పొదల్లోకి ఎత్తుకెళ్లిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వెళ్లిపోయాడు. ఆ బాలిక ఇంట్లోకి రాగానే, దుస్తులకు రక్తపు మరకలు అయివుండటాన్ని గమనించిన తల్లి... బాలికను పరిశీలించగా, మర్మాంగం నుంచి రక్తస్రావమైనట్టు గుర్తించి నిలదీసింది. 
 
ఆ వెంటనే జయవరావ్ వద్దకు వెళ్లి నిలదీయగా, తనకెలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పాడు. అంతేకాకుండా, ఘటనా స్థలివద్ద మరో వ్యక్తి ఉండవచ్చని అంటూ, వారిని తీసుకెళ్లాడు. అక్కడ వారిని మభ్యపెట్టి పారిపోయాడు. బాలికను తొలుత గురజాల ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, జయరావ్‌కు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా, భార్యకు దూరంగా ఉంటున్నాడు. పరారీలో ఉన్న జయరావ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ రైతు అబ్బాయిని పెళ్లాడితే అమ్మాయికి రూ. 1 లక్ష గిఫ్ట్...