Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో దారుణం.. కానిస్టేబుల్‌ను వెంటాడి వేటాడిన రౌడీషీటర్

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపై రౌడీ షీటర్ చంపేశాడు. కానిస్టేబుల్‌ను వెంటాడి మరీ హత్య చేశాడు. తొలుత తలపై బీరు సీసాతో తొట్టిన రౌడీలు.. ఆ తర్వాత ఆటోలో చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ హత్య కేసు దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి టాటూ దుకాణం వద్ద మద్యం సేవిస్తున్న ఆరుగురు రౌడీ షీటర్లకు కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ (35) కనిపించాడు. దీంతో ఆయన్ను అడ్డగించి వాగ్వివాదానికి దిగారు. మాట్లాడుతుండగానే ఓ రౌడీ బీరు బాటిల్‌తో దాడిచేసాడు.
 
అయితే, రౌడీలు ఎక్కువ మంది ఉండటంతో అక్కడ నుంచి తప్పించుకునేందుకు అతను ప్రయత్నించినప్పటికీ సఫలంకాలేకపోయాడు. దీంతో రౌడీలంతా కలిసి పోలీస్ కానిస్టేబుల్‌ను ఆటోలో ఎక్కించుకుని చెరువు కట్టవద్దకు తీసుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశాడు. 
 
ఆ తర్వాత ముగ్గురు రౌడీలు అక్కడ నుంచి పారిపోగా, మరికొందరు పట్టణంలోకి వెళ్లి స్థానికులను బెదిరించి వారి బైకులను లాక్కొని పారిపోయారు. కాగా, మృతుడు సురేంద్ర కుమార్ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments