ఎట్టకేలకు చింతమనేని ప్రభాకర్ అరెస్టు... గుర్తుతెలియని ప్రాంతానికి తరలింపు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:03 IST)
ఎట్టకేలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు అయ్యారు. ఆయన్ను ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు.
 
అంతకుముందు ఆయన గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెల్సిందే. ఆయన కోసం ప్రత్యేక బృందం పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాను బుధవారం ఇంటి వద్దకు వస్తానని దమ్ముంటే అరెస్టు చేసుకోవాలని చింతమనేని సవాల్ విసిరారు. 
 
ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగానే, దుగ్గిరాలలోని తన నివాసానికి ఆయన అనుచరులతో సహా వచ్చారు. అప్పటికే అక్కడ మకాం వేసిన పోలీసులు, ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు తాను వచ్చానని, కానీ పోలీసులు ఏ విధమైన విచారణ చేపట్టకుండానే అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా చింతమనేని విమర్శించారు. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగానే కేసుల్లో ఇరికించారని, న్యాయ పోరాటంలో తానే గెలుస్తానని అన్నారు. 
 
తానే స్వయంగా పోలీసుల ముందుకు వస్తానని చెప్పినప్పటికీ, ఇంత హై డ్రామా ఏంటని ప్రశ్నించారు. పోలీసుల వాహనాలు ముందుకు కదలకుండా ఆయన అనుచరులు అడ్డుకోగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments